కాజీపేట జంక్షన్‌లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

19-10-2026 | 06:57pm

ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ (టీఆర్‌డీ) విభాగం కార్మికులు 

కాజీపేట, అక్టోబర్ 19, (విజయక్రాంతి): కాజీపేట జంక్షన్‌(Kazipet Junction)లోని ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ (టీఆర్‌డీ) విభాగం ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు దుర్గామాత పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్‌డీ విభాగం ఏడీ ఈఈ జీ. శ్రీనివాసులు, ఎస్‌ఎస్‌ఈ బీ.మహేందర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది ఆవుల పరమేశ్ యాదవ్, రాజ్‌కుమార్, కిశోర్, శివ, జీ. శ్రీకాంత్, హరీష్, శాంతి, ప్రశాంత్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజేఏసీ కార్యదర్శి రాఘవేందర్‌ పాల్గొని పూజలు నిర్వహించారు. కార్మికులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరిపై దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు