ఘనంగా కుంకుమార్చన పూజలు
19-10-2026 | 06:58pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామం(Nandiwada village)లో సోమవారం శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన పూజలు(Kumkumarchana Puja) నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి పూజలో కూర్చున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో శివ గణేష్ యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.