దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకల్లో మంత్రి సీతక్క

19-10-2026 | 07:00pm

ములుగు, అక్టోబర్ 19 (విజయక్రాంతి): జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం మంత్రి సీతక్క(Minister Seethakka) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయం ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తనుగుల విజయ్ యాదవ్, నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంచెర్లలో, గోవిందరావుపేట మండలం చల్వాయిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రియాంక దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని, పండుగలు ప్రజల మధ్య సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు