జిల్లాకు కేటాయించిన నిధులు ఎన్ని
బోథ్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి కోసం ఏ మేరకు నిధులు కేటాయించారు అనే విషయాన్ని జిల్లా ప్రజలకు తెలిపి కేటీఆర్ క్షమాపణ(KTR Apologize) చెప్పిన తర్వాతనే పర్యటించాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) జిల్లా అధికార ప్రతినిధి పి.చంటి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అన్నా చెల్లెల రాజకీయం కోసం అదిలాబాద్ జిల్లా ప్రజలను ఆగం చేస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ కవిత అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు చేసింది ఏమిటో వివరంగా చెప్పాలన్నారు. చనాక కోరాట కుట్టి రిజర్వాయర్ చిక్ మాన్ ప్రాజెక్ట్ ల కోసం ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు వారు సిద్ధమని ప్రశ్నించారు. అదిలాబాద్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి కేటీఆర్ జిల్లాలో పర్యటించాలని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులు, సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గం శ్వేత పత్రం విడుదల చేసిన తర్వాతనే జిల్లాలో పర్యటించాలన్నారు.
కల్వకుంట్ల కుటుంబ గొడవను రాష్ట్ర ప్రజలపై రుద్దడం సరైనది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళి ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కరువు నివారణ చర్యలో భాగంగా తీసుకురావలసిన నిధులపై కలిసి పోరాటం చేయాల్సింది పోయి రైతులతో రాజకీయం చేయడాన్ని తప్పుపట్టారు.
జిల్లాలో నిరుద్యోగ యువతను తయారు చేసింది గత ప్రభుత్వమేనని విమర్శించారు. అదిలాబాద్ జిల్లా న్యాయంగా దక్కవలసిన గిరిజన యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే రూసా పథకంలో భాగంగా రావలసిన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల టెక్స్టైల్ పార్కు రాకుండా అడ్డుకున్నది కేటీఆర్ అని దీనికి సమాధానం చెప్తారా అన్నారు. జిల్లాను అన్ని రంగాలలో వెనుకంజ వేశారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్రహార్, బ్లాక్ కాంగ్రెస్ మాది అధ్యక్షుడు నరసింహ దాస్, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, అబూద్, మాజీ ఎంపిటిసి షేక్ రజియా బేగం నాజర్ అహ్మద్, సీనియర్ వార్డు సభ్యులు షేక్ షాకీర్, మండల అధికార ప్రతినిధి అచ్చితానంద రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షులు హలీముద్దీన్, నీరజ తదితరులు పాల్గొన్నారు.