ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి రామన్న ధ్వజం
రైతు గర్జన సభకు కేటీఆర్ రాక...
ఆదిలాబాద్, అక్టోబర్ 24, (విజయక్రాంతి) : ఆదిలాబాద్(Adilabad) లోని డైట్ మైదానంలో నవంబర్ 1న రైతు గర్జన సభను(Farmers Roar Meeting) నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) తెలిపారు. ఈ సభ కు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ముఖ్య అతిథిగా హాజరై రైతులు(Farmers) ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడతారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల నుంచి ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో(BRS Party Office) పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో(impact of El Niño) రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పలు సందర్భాల్లో మాట్లాడటం రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే రైతులకు అండగా నిలవాల్సింది పోయి గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.
ఒకవైపు రైతులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంటే, ఎమ్మెల్యే ప్రభుత్వం తీరును ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించి రెండుసార్లు పాదయాత్రను విరమించుకున్నారని జోగు రామన్న ఎద్దేవ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేయడంతోనే ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాదయాత్ర ఆగిపోయిందని పేర్కొనారు.
ఈ కార్యక్రమంలో నాయకులు లింగారెడ్డి, అజయ్, వెనుగంటి ప్రకాష్, గండ్రత్ రమేష్, మార్శెట్టి గోవర్ధన్, యాసం నర్సింగ రావు, మెట్టు ప్రహల్లద్, యునుస్ అక్బానీ, సాజితొద్దీన్, చందాల రాజన్న, దాసరి రమేష్, విజేయ్,గణేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.