ప్రమాదంలో గాయపడిన విద్యార్థినికి సరిత తిరుపతయ్య పరామర్శ
24-10-2026 | 11:10pm
అలంపూర్ అక్టోబర్ 24 (విజయక్రాంతి): బొంకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) గాయపడి నిమ్స్‌లో చికిత్స(Treatment at NIMS) పొందుతున్న వెటర్నరీ విద్యార్థిని ఉషారాణిని కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ సరిత తిరుపతయ్య(Saritha Tirupatayya) శనివారం పరామర్శించారు. రాజ్ న్యూస్ రిపోర్టర్ పెద్దింటి నాగేష్ కుమార్తె అయిన ఉషారాణి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఆమెకు ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.విద్యార్థినికి ప్రమాదం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు.