డిఫాల్ట్ రైస్ మిల్లర్ లు 45 రోజులలోపు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి

24-10-2026 | 11:16pm

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్     

  సూర్యాపేట, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : జీఓ ఎంఎస్ నెం. 17 ప్రకారం, డిఫాల్ట్ మిల్లర్లు(Default Millers) బాకీ పడిన సీఎంఆర్ బియ్యాన్ని(CMR Rice) 45 రోజుల్లోపు ప్రభుత్వానికి చెల్లించాలనీ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(District Collector Tejas Nandlal Pawar) అన్నారు. బియ్యాన్ని సన్న బియ్యం రూపంలో ఇవ్వాలి, లేదా దానికి సరిపడా ధరను 25% పెనాల్టీ, 12% వడ్డీతో కలిపి చెల్లించాలన్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్(Commissioner of Civil Supplies) ఆదేశాల మేరకు శనివారం కలెక్టర్ అధ్యక్షతన డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డి ప్రభాకర్, అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్ పాల్గొనీ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన 45 రోజుల గడువును సద్వినియోగం చేసుకుని బాకీలు  చెల్లించాలని సూచించారు.

గడువులోపు చెల్లించని మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్, 1864 ప్రకారం వారి ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందం బకాయిలు చెల్లించని మిల్లులను ఇప్పటికే సందర్శిస్తున్నారన్నారు. సమావేశం ముగిసిన వెంటనే ధనలక్ష్మి రైస్ మిల్ యజమాని గంగిరెడ్డి ఆదినారాయణ రెడ్డి తమ బాకీ మొత్తాన్ని 100% చెల్లించారు. ఆ మొత్తానికి చెక్కును జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్ వి. శ్రీధర్ రెడ్డికి అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ వి. మోహన్ బాబు, డిప్యూటీ తహసీల్దార్లు, టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు.                                  .

మరిన్ని వార్తలు