రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

24-10-2026 | 11:26pm

బెజ్జూర్ అక్టోబర్ 24( విజయ క్రాంతి ) : బెజ్జూర్ మండలంలోని(Bejjur Mandal) నాగుల వాయి గ్రామానికి చెందిన కవిడే విజయ్ కి రోడ్డు ప్రమాదంలో(Road accident)  కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర(Maharashtra) వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో  కోయపల్లి గూడెం మార్గ మధ్యలో  బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో ఎడమ కాలుకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. రోడ్డంతా గుంతల మయం, కంకర మయం గా ఉండడంతో వాహనదారులు(Motorists) అదుపుతప్పి కింద పడిపోతున్నారని ఇట్టి విషయమై పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇట్టి విషయం గమనించిన స్థానిక ప్రయాణికులు గాయపడ్డ విజయ్ ను 108 అంబులెన్సులో బెజ్జూర్ సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు