గంజాయి పంట సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
22-10-2026 | 10:09pm
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని నిగిని గ్రామానికి చెందిన మడవి లక్ష్మణ్55 అనే వ్యక్తి అక్రమంగా గంజాయి సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. తనకున్న పొలంలో 40 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ఎస్సై వి పురుషోత్తం ఆధ్వర్యంలో నిగినిశివారులో ఉన్న తనిఖీలు నిర్వహించారు. లక్ష్మణ్ సాగు చేస్తున్న చేనులో 40 గంజాయి మొక్కలు నాలుగు లక్షల విలువైనవి లభించాలని ఆయన పేర్కొన్నారు. దీంతో గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని ఆయన తెలిపారు.