పంచాయతీ వాటర్ ట్యాంక్ ఎక్కడపడితే అక్కడే..
ప్రజలకు కాదు.. హోటల్ కే పరిమితం..
మునిపల్లి అక్టోబర్ 22 : (విజయక్రాంతి )అదొక పంచాయతీ వాటర్ ట్రాక్టర్ ట్యాంక్(Panchayat water tanks).. ప్రజలకు దాహాన్ని తీర్చేందుకు.. గ్రామంలో తిరగాల్సిన పంచాయితీ వాటర్ ట్రాక్టర్ ట్యాంక్.. మునిపల్లి చౌరస్తాలోని ఓ హోటల్ వద్ద దర్శనమిస్తోంది.. అయ్యో సారు మాకు నీరు కావాలని.. గ్రామస్తులు అడిగితే.. నాకేం తెలుసు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.
ఆ గ్రామ పపంచాయతీ కార్యదర్శి.. వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ ఎక్కడుంది.. అంటూ పంచాయతీ కార్యదర్శిని.. విజయ క్రాంతి రిపోర్టర్ వివరణ కోరగా.. నాకు తెలవదు.. అంటూ బదులు సమాధానం ఇచ్చాడు. కాగా.. గ్రామంలో ఉండాల్సిన పంచాయతీ వాటర్ ట్యాంక్ హోటల్ వద్ద ఉండడంపై పలువురు పంచాయతీ కార్యదర్శి పై మండిపడుతున్నారు..