సుద్దగూడలో ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనకు సుద్దగూడలో ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలం సుద్దగూడ గ్రామంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) పర్యటన సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) పర్యటించారు. మంత్రి పర్యటనలో భాగంగా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను(Indiraamma houses) పరిశీలించి, కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అవసరాలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.