రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తాం

03-10-2026 | 08:48pm

రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్ఛ కార్యవర్గ సభ్యులు: కొండం ఆంజనేయులు ముదిరాజ్

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 3(విజయక్రాంతి): గ్రామస్థాయి కార్యకర్తగా(Village-level activist) ప్రస్థానం నుండి రాష్ట్ర స్థాయి బాధ్యతల వరకు అంచెలంచెలుగా ఎదిగిన నాయకత్వానికి గుర్తింపు జరిగింది. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్ఛ(Telangana State Bharatiya Janata Party Kisan Morcha) కార్యవర్గ సభ్యులుగా కొండం ఆంజనేయులు ముదిరాజ్(Kondam Anjaneyulu Mudiraj) నియమితులు కావడం జరిగింది. రాష్ట్ర కిసాన్ మోర్ఛ అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య విడుదల చేసిన నియామక పత్రాన్ని రాష్ట్ర బిజెపి మాజి ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆంజనేయులుకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం యువమోర్చ మండల కార్యదర్శి,జిల్లా కార్యదర్శి బాధ్యతల మీదుగా 2020 నుండి 2024 వరకు మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షులుగా కొనసాగినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్.చీర్ల సత్యనారాయణ.చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్.వంగేటి హానుమంత రెడ్డి.జాకట ప్రేమ్ దాస్.బి రాఘవరెడ్డి.బండి విష్ణు గౌడ్.వంగేటి రవీందర్ రెడ్డి.మల్లేష్ యాదవ్.బి వంశీధర్ రెడ్డి.నర్సింగ్ రావు.ఈశ్వర్.మహేష్. తదితరులు పాల్గొన్నారు...

1)బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్ఛ కార్యవర్గ సభ్యులుగా నియామక పత్రాన్ని అందిస్తున్న కొంపల్లి మోహన్ రెడ్డి...

మరిన్ని వార్తలు