ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలి
19-10-2026 | 06:04pm
బోథ్ (విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ఐకమత్యంతో ఉత్సవాలను జరపడం సంతోషంగా ఉందన్నారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారంతో జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్, బజార్హత్నూర్ పిఎసిఎస్ చైర్మన్ వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు బోరే రవీందర్, కనపర్తి చంద్ర కాంత్, మిట్కారే రాజేశ్వర్, సిహెచ్ వెంకటేష్, దిగోలే విష్ణు, గోడెం జుగాదిరావ్ మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.