సమసమాజ నిర్మాణమే ఫూలే దంపతులకు నిజమైన నివాళి

28-11-2026 | 11:46am

ఆదిలాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): సమసమాజ (Equal Society) నిర్మాణమే మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులకు అర్పించే నిజమైన నివాళి అని మహారాష్ట్రకు చెందిన యావత్ మాల్ అడ్వకేట్ రాజేంద్ర మహాడోలే అన్నారు. ఫూలే 136వ వర్ధంతి (Death Anniversary) సందర్భంగా ఆదిలాబాద్‌లోని ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫూలే ఆశయాలను (Ideals) ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాలీ మహారాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్, ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు