పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

28-11-2026 | 01:22pm

వెల్దండ, నవంబర్ 28 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకుడు జోగయ్య పిలుపునిచ్చారు.వెల్దండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని (Death Anniversary) నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జోగయ్య మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త (Social Reformer) అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి, సమాన హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమాజంలో సమానత్వం సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగం, గుత్తి వెంకటయ్య, వార్డు సభ్యులు జంగిలి సునీత ఆనంద్, జంగిలి ప్రవీణ్, జంగిలి రవికుమార్, మట్ట శ్రీనుగౌడ్, రాజు నాయక్, జగన్ నాయక్, జంగిలి శ్రీనివాస్, దాసరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు