ఆక్రమణకు గురువుతున్న రోడ్డు కాపాడండి సారు
10-09-2026 | 06:44pm
బెల,(విజయక్రాంతి): బేల లోని శివాజీ చౌక్ నుంచి అశోక్‌నగర్ మీదుగా భవానీగూడ వైపు వెళ్లే 'పానాది' (రోడ్డు) ఆక్రమణకు గురవుతోందని అశోక్ నగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, ఆక్రమణల నుండి కాపాడాలని కోరుతూ కాలనీ వాసులు గురువారం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్(Tehsildar Praveen Kumar)కు వినతిపత్రం అందజేశారు. గతంలో కూడా ఈ స్థలం ఆక్రమణకు గురికాగా, నాటి గ్రామ సర్పంచ్ ఆ నిర్మాణాన్ని తొలగించినట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం మరోసారి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.