మోలకెత్తుతున్న సోయా విత్తనం

25-09-2026 | 12:23pm

ఆందోళన చెందుతున్న రైతులు

బోథ్,(విజయక్రాంతి): సోయాబీన్ పంట(Soybean crop) మరో 15 రోజుల్లో చేతికి వస్తుందన్న ఆనందంతో రైతులు(Farmers) ఉండగా ప్రకృతి కన్నెర మూలంగా సోయా మొక్కలపైన ఉన్న కాయల నుండి విత్తనాలు మొలకెత్తిస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అడప దడప కురుస్తున్న వర్షాల వల్ల చేతికందే దశలో ఉన్న సోయా కాయల నుండి చిన్న చిన్న మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలే కరువు కోరల్లో ఉన్న రైతాంగానికి పగబట్టిన ప్రకృతి వల్ల నష్టం సంభవించే ఆస్కారం ఉంది.

మరిన్ని వార్తలు