మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి సహకరించండి
23-09-2026 | 10:21pm
బోథ్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధి(Women's Economic Development) మహిళా సంఘాలు సహకరించాలని వివో ఏ భాగ్యలక్ష్మి కోరారు. మండలంలోని పిప్పల్ దరి గ్రామంలో.సి.ఆర్.పి ల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వివో అధ్యక్షురాలు పందుల నీరజతో పాటురోండ్ల ప్రవీణ, వివో ఏ భాగ్యలక్ష్మి పంచాయతీ కార్యదర్శి సుగంధ గ్రామ సర్పంచ్ అనసూయ మహిళా సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.