భక్తి శ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి వేడుకలు(Ganesh Navaratri Celebrations) అట్టహాసంగా ముగిశాయి. పోచమ్మ చెరువులో విఘ్నేశ్వరులను నిమజ్జనం చేసి భక్తులు వీడుకోలు పలికారు. నవరాత్రులను పురష్కరించుకొని భక్తులు ఘనంగా పూజలు చేశారు. కొలువు దీరిన గణనాథులు తొమ్మిది రోజులపాటు తీరొక్క పూజలందుకొన్నారు. ముగింపు వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణంలో గణ నాథుల శోభ యాత్రలతో సందడి నెలకొన్నది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ట్రాఫిక్ చర్యలు పటిష్టం చేశారు.
పోచమ్మ చెరువు వద్ద నిమజ్జనం వేడుకలు సజావుగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం వర్షం వల్ల అసౌకర్యం కలిగింది. పోచమ్మ చెరువు వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. క్రేన్ల తో నిమజ్జనం చేశారు. గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ నిమజ్జనోత్సవాన్ని దగ్గర ఉండి పర్యవేక్షించారు. గట్టి పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేశారు. మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, అధికారులు ముగింపు వేడుకలు తగిన సదుపాయాలు కల్పించారు.ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు ముగిశాయి..