ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
తలమడుగు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల(Primary school)కు చెందిన కొల్లూరి శంకర్‌కు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(Best Teacher Award), సందుక్వార్ వెంకటరమణకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లభించాయి. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఏలుగు రాజన్న మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు(Teachers) అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మరిన్ని అవార్డులు రావాలని, గ్రామంలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాములు, అఖిలేష్, అనిరుద్ధ్, శివ, రాజు, వినయ్, ఉపాధ్యాయులు రమేష్, శిరీష, పాఠశాల సిబ్బంది పురుషోత్తం, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.