ఆదిలాబాద్ అడవుల్లో పెద్ద పులులు
- 15 రోజుల్లో ఐదు పశువులపై దాడి
- భయాందోళనల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు
- పులుల సంచారంపై అటవీ శాఖ నిఘా
బోథ్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో మళ్లీ పెద్ద పులుల సంచారం(Movement of tigers) మొదలైంది. జిల్లాలోని బోథ్, నేరడిగొండ మండలాల(Neradigonda mandals) పరిధిలోని అడవుల్లో మూడు పెద్ద పులులు సంచరిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర(Maharashtra)ను ఆనుకొని ఉన్న ఈ ప్రాంత అడవుల్లో మొదట ఒక పులి మాత్రమే సంచ రించేదని, ఆ తర్వాత మరో రెండు పులులు వచ్చినట్టు అటవీశాఖ నిఘా వర్గాలు గుర్తిం చాయి. దీంతో పులుల సంరక్షణ పైన అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
వాటి సంచారం పైన ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే, ప్రజలను అప్రమత్తం చేస్తున్నా రు. ఆదిలాబాద్ జిల్లా అడవులను ఆనుకోని ఉన్న మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని పులుల సంరక్షణ కేంద్రం(Tiger Conservation Centre) నుండి ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మొత్తం మీ ద ఐదు పులులు సంచరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని భీంపూర్, తలమడుగు, బజార్హ త్నూర్, మండలంలోని దట్టమైన అడవుల నుండి మహారాష్ట్ర అడవుల మీదుగా వజ్జర్ అడవుల్లోకి పులులు వస్తూపోతున్నాయి.
జిల్లాను ఆనుకొని ఉన్న నేరడిగొండ మండ లంలోని కుంటల జలపాతం ఆనుకొని ఉన్న అడవితో పాటు ఇచ్చోడ మండలంలోని అ డవులు టైగర్ జోన్‌గా ప్రకటించారు. అయి తే టైగర్ జోన్లో పులుల జాడ కనిపించక పోగా వాటి రాక కోసం అటవీశాఖ అధికా రులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా పులులు ఉన్నట్లు అధికారులు గు ర్తించలేరు. ఒక్క పైసా ఖర్చు లేకుండానే బోథ్, నేరడిగోండ అడవుల లోకి పులులు వస్తున్నాయి. అయితే ఫులులకు కావలసినం త ఆహారంగా జంతుజాలం ఉండటంతో అడవులలో ఉంటున్నాయని అటవీశాఖ అ ధికారులు అంటున్నారు.
సోనాల మండలం లోని చింతల బోరి, పార్డి, వజ్జర్ గ్రామాల రైతులకు చెందిన పశువులు అడవుల్లోకి మే త కోసం వెళ్ళిన సమయంలో దాడి చేసి చం పుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఐదు పశువులపై దాడి చేయడంతో అటవీ సమీప గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు పులులకు హాని జరగకుండా ప్రజలను చైతన్యం చేస్తు న్నారు. ఈ ప్రాంత అడవులను పులుల సంర క్షణ కేంద్రంగా అధికారులు గుర్తించినట్లయి తే పులుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారం ఉందని పరిశీలకులు అంటున్నారు. పులులు సంచరించే ప్రాంతంలో అధికారులు బోర్డుల ను సైతం ఏర్పాటు చేసి ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు.