చెన్ను కోచ్‌గా జహీర్ ఖాన్

22-09-2026 | 05:00am

ఫ్లెమింగ్ స్థానంలో బాధ్యతలు 

చెన్నై, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్రధాన కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌(Zaheer Khan)ను ఆ జట్టు యాజమాన్యం నియమించింది. ఐపీఎల్ 18 సీజన్లు(18 Seasons of IPL)గా కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ బాధ్యతలు చేపట్టనున్నట్టు సీఎస్‌కే సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈసారి భారత క్రీడాకారుడి(Indian sportsperson)కి కోచ్‌గా బాధ్యతలు అప్పగించాలని ఆ జట్టు నిర్వహణ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కమిటీలో ధోనీ, సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, జట్టు యజమాని రూపా గురునాథ్ ఉన్నారు. కాగా త్వరలో 48 ఏళ్లు పూర్తి చేసుకోనున్న జహీర్ భారత్ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో లక్నోకు మెంటార్‌గా వ్యవహరించాడు. 

మరిన్ని వార్తలు