మంత్రి ఉత్తమ్ చిత్రపటానికి పాలాభిషేకం

27-10-2026 | 05:17pm

నేరేడుచర్ల, అక్టోబర్ 27(విజయ క్రాంతి): భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రివర్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister N. Uttam Kumar Reddy) మరియు మండల పార్టీ అధ్యక్షులు చిన వెంకట్ రెడ్డిల సహకారంతో సోమారం గ్రామానికి సోమారం నుండి తక్కెలపాడు వరకు 4 కోట్ల 80 లక్షలు మరియు సోమారం నుండి ఉట్లపల్లి వరకు 2 కోట్ల 70 లక్షలు రూపాయల వ్యయంతో బిటి రోడ్డుకు మంజూరు చేయించినందుకు గ్రామ రైతులు,నాయకులు, మహిళలు, కూలీలు మంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను నేరేడుచర్ల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మరియు సోమారం గ్రామ సర్పంచ్  షేక్ రహీముద్దీన్, ఆధ్వర్యంలో నిర్వహించారు.

మరిన్ని వార్తలు