ఖానాపూర్ ఎమ్మెల్యే పూజలు
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.