డిస్ట్రిక్ట్ అకాడమిక్ పానల్ వారి ఆకస్మిక తనిఖీ

27-10-2026 | 05:28pm

నేరేడుచర్ల,అక్టోబర్ 27 (విజయ క్రాంతి): డిస్టిక్ ఎకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం(District Academic Panel Inspection Team) వారు నేరేడుచర్ల లోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అభ్యసన ఉన్నతి కార్యక్రమంలో తరగతుల్లో విద్యార్థుల సామర్ధ్యాల పరిశీలన, ఖాన్ అకాడమీ, డిజిటల్ లెర్నింగ్, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్,

ఎండిఎం మరియు పాఠశాల అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాల పై సమగ్రమైన పరిశీలన జరిపి,అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో తగిన సూచనలు సలహాలు అందించారు.ఈసందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  బట్టు.మధు మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి ఇన్స్పెక్షన్ టీం అందిస్తున్న సూచనలు సలహాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు ,

ఇన్స్పెక్షన్ టీం నోడల్ ఆఫీసర్ పందిరి. నర్సిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో అమలవుతున్న పలు కార్యక్రమాలు అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు,టీం ఉపాధ్యాయులు మండవ ఉపేందర్,జాఫర్,బూర వెంకటేశ్వర్లు,సైదులు,జానకి రాములు, మండవ సైదులు,ఆనందభాస్కర్ పిడి అజమ్ బాబా మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు