మంజుల మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

13-10-2026 | 10:07pm

కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): విద్యార్థి, ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మంజుల అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని కొత్తగూడెం కార్పొరేషన్ తెలంగాణ ఉద్యమకారులు, సిపిఐ (ఎమ్మెల్) న్యూ డెమోక్రసీ పట్టణ నాయకురాలు, జర్నలిస్టులు, మంజుల(Manjula) అనారోగ్యంతో మృతి పట్ల తీవ్ర ధిర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఉంచారు.

మంగళవారం ఐఎఫ్టీయూ కార్యాలయానికి చేరుకున్న మీడియా మిత్రులు ఇమ్మంది ఉదయ్ కుమార్ విజయక్రాంతి బ్యూరో రిపోర్టర్ జి వి నరసింహారావు. సుధాకర్. సత్యం. రామకృష్ణ .శ్యామ్ నరసింహారావు. దుర్గేష్  ఆమెకు నివాళులర్పించారు. డాక్టర్ బిఎస్ రావు ఉద్యమ నాయకులు సంఘం వెంకట్ పుల్లయ్య ,మీడియా మిత్రులు  సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో  మాట్లాడుతూ.. పీడీఎస్యూలో సుదీర్ఘకాలం పనిచేసి విద్యార్థి సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన నిబద్ధత గల వ్యక్తి మంజుల అని కొనియాడారు.

విద్యార్థి ఉద్యమాల నుంచి జర్నలిస్టుగా, ప్రజా ఉద్యమ నేతగా ప్రజల పక్షాన నిలిచి గళమెత్తారని గుర్తుచేసుకున్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భర్త, జర్నలిస్టు జంపన్నకు, వారి కుమారుడికి, కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ , సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్క అజిత్, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సిపిఐ ఎంఎల్ చంద్రన్న వర్గం రాష్ట్ర నాయకులు కందకట్ల సురేందర్ తదితరులు వున్నారు.

మరిన్ని వార్తలు