మండల ప్రత్యేక అధికారిగా రాజ్ కుమార్
నాగిరెడ్డిపెట్, (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండల ప్రత్యేక అధికారిగా రాజ్ కుమార్(Raj Kumar) బాధ్యతలు స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారి రాజ్కుమార్ ఎస్సీ కార్పొరేషన్ ఏజిక్యూటివ్ డైరెక్టర్ ఈడి నుండి వచ్చి నాగిరెడ్డిపేట మండలం ప్రత్యేక అధికారిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2025-26 ఆర్థిక సంవత్సరం ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1767 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో 295 లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
టూ వీలర్కు 140 దరఖాస్తులు, త్రీ వీలర్కు 67 దరఖాస్తులు, గేదెలకు 73 వచ్చాయని తెలిపారు. టూ వీలర్ కు 90000 సబ్సిడీ ఫోను 10,000 కట్టాల్సి ఉంటుందన్నారు. త్రీ వీలర్కు మూడు లక్షలు ఉండగా 260 సబ్సిడీ పోను 40,000 కట్టాలన్నారు. గేదెలకు 1,60,000 సబ్సిడీ పోను 40 వేలు కట్టాలని తెలిపారు. సోలార్ ప్లాంట్ కు 100 శాతం ఆరు లక్షల సబ్సిడీ వర్తిస్తుందని, మూడు ఎకరాల భూమి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, ఎంపీఓ ప్రభాకర్ చారి తదితరులు ఉన్నారు.