17 మందిని బైండోవర్ చేసిన బెజ్జూర్ పోలీసులు
బెజ్జూర్ అక్టోబర్ 13 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల పరిధిలో గుడుంబా, మట్కా, కోడిపందాలకు సంబంధించిన కార్యకలాపాలకు పాల్పడిన 17 మంది వ్యక్తులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్(Executive Magistrate-cum-Tahsildar) ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై రమేష్ తెలిపారు.ఇకపై సదరు వ్యక్తులు గుడుంబా, మట్కా, కోడిపందాలు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా,
ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉండాలని బైండోవర్ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మండల పరిధిలో ఎవరైనా గుడుంబా తయారీ,విక్రయాలు, మట్కా, కోడిపందాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రమేష్ హెచ్చరించారు.
అలాగే, మండల పరిధిలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు లేదా పైన పేర్కొన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్: 87126 70541