ఉచిత కంటి వైద్య శిబిరం

30-09-2026 | 03:02pm

మెట్ పల్లి,సెప్టెంబర్ 30(విజయక్రాంతి):మెట్‌పల్లి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి):మెట్‌పల్లి లయన్స్ క్లబ్ (Lions Club) ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు వేల్ముల శ్రీనివాస్ రావు అధ్యక్షతన బుధవారం ఉదయం మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి (Private Hospital) ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం (Eye Camp) నిర్వహించారు.లయన్ ఐ హాస్పిటల్ (Lion Eye Hospital), రేకుర్తి బృందానికి చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ.. మెట్‌పల్లి పట్టణం, మండల పరిసర ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం (Free Medical Camp) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ శిబిరంలో దాదాపు 150 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వారిలో 40 మందిని తదుపరి చికిత్స కోసం కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్‌కు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో (Service Activities) ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ బొమ్మెల శివ, క్యాషియర్ జోగ జగదీశ్వర్, డాక్టర్ నిర్మల్ రెడ్డి, డాక్టర్ పద్మ, దొంతుల ఆంజనేయులు, ప్రోహార్ తుకారాం, ఆల్‌రౌండర్ గంగాధర్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు