సైబర్ వారియర్స్‌తో ఎస్పీ సమీక్ష సమావేశం

24-10-2026 | 06:52pm

సైబర్ నేరాల పట్ల సత్వర పరిష్కారం

కొత్తగూడెం అక్టోబర్ 24 విజయ్ కాంతి : భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(Bhadradri District SP Rohit Raju) ఐపీఎస్ సైబర్ వారియర్స్‌తో(Cyber ​​Warriors) సమీక్ష సమావేశం  లో విధులు, బాధ్యతలు, సైబర్ పెండింగ్, నేరాల కేసుల దర్యాప్తు పురోగతి, ఫిర్యాదుల పరిష్కారం, వివిధ పోర్టళ్లపై సిబ్బందికి ఉన్న అవగాహన, పీటీ వారెంట్ల అమలు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సైబర్ నేరాల(Cybercrimes) బాధితులు  ఫిర్యాదు లు అందిన తక్షణమే స్పందించి, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదు పై వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టి బాధితులకు పోలీస్ స్టేషన్(Police Station) స్థాయిలోనే న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును(Investigation of pending cases) వేగవంతం చేసి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని తెలిపారు.

ఎన్సిఆర్పి, జిఆర్ఎం, ఎంఆర్ఎఫ్, సహయోగ్, సమన్వయ, సైబర్ క్రైమ్ అనలిటిక్స్ అండ్ ప్రాసిక్యూషన్ సిస్టమ్ వంటి పోర్టళ్ల విధులు, వినియోగంపై సైబర్ వారియర్స్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. 1930 సైబర్ హెల్ప్‌లైన్(Cyber ​​Helpline) ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఆర్థిక సైబర్ మోసాల బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

 పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లను గుర్తించి, వాటి అమలును వేగవంతం చేయాలని, సంబంధిత దర్యాప్తు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అమలైన వారెంట్ల వివరాలను సైబర్ క్రైమ్ అనలిటిక్స్ అండ్ ప్రాసిక్యూషన్ సిస్టమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ప్రజలకు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ వారియర్స్ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ పెండింగ్ ఫిర్యాదులు, కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ  సూచించారు.

ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ నరేష్, ఎస్సై జుబేదా బేగం, డిఫోర్సి సిబ్బంది, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు