కోర్టు వాయిదాలకు హాజరుకాని వ్యక్తి అరెస్ట్‌

24-10-2026 | 07:11pm

న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలింపు

చివ్వెంల, అక్టోబర్ 24 (విజయక్రాంతి): కోర్టు వాయిదాలకు(Court adjournments) హాజరుకాకపోవడంతో న్యాయస్థానం(Court of Law) ఆదేశాల మేరకు సర్వారం గ్రామానికి చెందిన నల్ల లవన్ కుమార్(Nalla Lavan Kumar) (తండ్రి వెంకయ్య), మోతే మండలం, ను చివ్వెంల పోలీసులు(Chivvemla Police) అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ వి. మహేశ్వర్(SI V. Maheshwar) తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన వాయిదాలకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. న్యాయస్థానం ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు