భక్తి శ్రద్ధతో మట్టి గణపతిని పూజిద్దాం

13-09-2026 | 01:55pm

పినపాక ,సెప్టెంబర్ 13,(విజయక్రాంతి): వినాయక చవితి వస్తోందంటేనే భక్తి, ఆనందం, సంబరం. అయితే ఈ సంబరం పర్యావరణానికి హాని చేయకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత.రసాయన రంగులతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో కరగవు. నదులు, చెరువుల్లో కలిసి నీటిని కలుషితం చేసి,జలచరాలకు ప్రాణహాని కలిగిస్తున్నాయి.

అందుకే ఈసారి మట్టి గణపతినే పూజిద్దాం.మట్టి వినాయకుడు సహజంగా నీటిలో కరిగిపోతాడు,ప్రకృతిలో కలిసిపోతాడు.మట్టి గణపతిలోనే నిజమైన పవిత్రత,పర్యావరణ స్పృహ ఉంది.

గణపతి పూజతో పాటు ఒక మంచి సంకల్పం చేద్దాం

ఇంటికొక మొక్క నాటుదాం.ఒక మొక్క నాటితే,ఆ మొక్కతో పాటు మన భక్తి కూడా పెరుగుతుంది.అదే నిజమైన పర్యావరణ పరిరక్షణ.మట్టి గణపతి - స్వచ్ఛమైన భక్తికి ప్రతీక.ఒక మొక్క - భవిష్యత్తు తరాలకు కానుక.రండి, ఈ వినాయక చవితికి మట్టి గణపతిని పూజించి, పచ్చని ప్రకృతిని కాపాడుకుందాం.విజయ క్రాంతి ప్రింట్ మీడియా పినపాక

మరిన్ని వార్తలు