గ్రీన్ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
ముత్తగూడెం: ఖమ్మం జిల్లాలోని(Khammam District) ముత్తగూడెం సమీపంలో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్ఫీల్డ్ హైవేపై(Greenfield highway) అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం(Chintalapudi Mandal) ఎర్రగుంటపాడు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు షాపింగ్ కోసం ఖమ్మం వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవర్ ఒక లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని మొదట పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.