విజయక్రాంతి ఎఫెక్ట్ .. బెజ్జూర్ ఎస్సై అటాచ్..!

13-09-2026 | 08:57am

బెజ్జూర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రేషన్ బియ్యం అక్రమ వసూళ్ల దందాపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా(Bejjur SI Sartaj Pasha) కు రేషన్ బియ్యం వ్యవహారంపై వేటు పడింది. ఎస్సై సర్తాజ్ పాషా  ను జిల్లా కేంద్రానికి అటాచ్ చేసినట్లు ఈనెల 11న ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయక్రాంతి దినపత్రికలో ఈ నెల 10న "సర్దుకుంటున్న పోలీస్ " అవినీతి ఆరోపణల ఉచ్చులు అధికారి, బెజ్జూర్ ఎస్సై తన బినామి వ్యక్తితో రేషన్ బియ్యం అక్రమ దందాపై డబ్బులు వసూలు ఫోన్ పే ద్వారా చేసిన స్క్రీన్ షాట్స్ , బినామీ వ్యక్తి రేషన్ దందా చేసే వారితో సార్ ట్రాన్స్ఫర్ ఐ వెళ్తున్నారు డబ్బులు ఇవ్వాలని మాట్లాడే సంభాషణ  ఆడియోలు బట్టబయలు అయ్యాయి.

ఎస్సై చేసిన అక్రమాల పై జిల్లా ఎస్పీ నితిక పంత్ సీరియస్ గా తీసుకున్నారు. ఎస్సై చేసిన అక్రమ వసూలు పై విజయ క్రాంతి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీనితో ఉన్నత పోలీస్ శాఖ అధికారులు విచారణ జరిపి జిల్లా కేంద్రానికి అటాచ్ చేసినట్లు తెలిపారు. అటాచ్ గానే చేశారా..? లేదా పూర్తిస్థాయిలో విచారణ జరిపి సస్పెండ్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు