లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురు స్పాట్ మృతి
13-09-2026 | 08:52am
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ విజయనగరం(Vizianagaram) జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)జరిగింది. బూసయవలస దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను బాడంగి మండలం(Badangi Mandal) గజరాయునివలసకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ గుణుపూరి తిరుపతితో సహా మరో ఇద్దరు మరణించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.