రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం
13-09-2026 | 02:38pm
కొండా సురేఖ మురళి దంపతుల ప్రకటన
వరంగల్, (విజయక్రాంతి): రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రధాని చేయడమే తమ లక్ష్యమని మాజీమంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ప్రకటించారు. ఆదివారం వరంగల్ నగరంలోని ఎంకె నాయుడు కన్వెన్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తలు అభిమానులతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీ నుంచి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసిన సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం కొండ దంపతులు వరంగల్ నగరంలో(Warangal City) నిర్వహిస్తున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం వారు తమ కార్యాచరణను పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది.