సనత్ నగర్‌ TIMSలో రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్

13-09-2026 | 12:29pm

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో సనత్ నగర్‌ TIMSలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్(Robotic Surgery Workshop) ఆదివారం నాడు ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Raja Narasimha) హాజరయ్యారు. సనత్ నగర్‌లోని డా. మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిలో(Marri Chenna Reddy TIMS Hospital) స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో(Technical knowledge) రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను పరిశీలించించిన దామోదర రాజనర్సింహ వాటి వినియోగంపై నిపుణులతో చర్చించారు. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ(Robotic Surgery) సేవలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంపై వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేసి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో DME డా. వాణి, TIMS డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్, డా. బీరప్ప, డా. విమల థామస్, డా. సుధీర్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు