నాచారంలో గ్రామ సభ - హాజరైన అడిషనల్ డి ఆర్ డి ఓ రవి

02-10-2026 | 04:58pm

దమ్మపేట, అక్టోబర్ 02 (విజయక్రాంతి): మండల పరిధిలోని నాచారంలో సర్పంచ్ చీకటి రమాదేవి అధ్యక్షతన జరిగిన గ్రామ సభ కు అడిషనల్ డి ఆర్ డి ఓ రవి హాజరై మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించి పూర్తిస్థాయి విబి జి రాంజీ ప్రణాళిక, ఎల్నినో ఎదుర్కోవటానికి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు సమగ్ర ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.

విబిజీ రాంజీలో ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పించాలని, ఎక్కువ వేతనం ఖర్చు చేస్తే దాని ద్వారా 40 శాతం మెటీరియల్ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, వాటితో గ్రామపంచాయతీ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కువగా భూగర్భ జలాలు పెంపుదలకు సంబంధించి నీటి సంరక్షణ పనులు చేయాలని కోరారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంట, ప్రతి రైతు ఫారం పాండ్ చేసుకోవాలని తెలిపినారు. భవిష్యత్తులో నీటి కొరత రాకుండా నీటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి రమణ, ఈసీ రాజు, రాజారత్నం, ఏపీఓ సుధాకర్, టి ఏ రాఘవ, సెక్రెటరీ సంతోష్ ఫీల్డ్ అసిస్టెంట్ నాగేశ్వరావు, ఉపసర్పంచ్ శ్యామల, చీకటి శ్రీనివాసరావు, చీకటి మురళి, రాజులపాటి రాంబాబు, గ్రామ ప్రజలు, డ్వాక్రా మహిళలు తదితరులు హాజరైనారు.

మరిన్ని వార్తలు