ఆసియా క్రీడలు 2026: 65 కేజీల రెజ్లింగ్‌లో స్వర్ణం

02-10-2026 | 05:50pm

నాగోయా: ఆసియా క్రీడలు-2026(Asian Games-2026)లో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్(Indian Wrestler Sujeet Kalkal) అదరగొట్టాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్లో తజికిస్థాన్ రెజ్లర్ అబ్దుల్‌మజీద్ కుడియేవ్‌పై 2-9తో వెనుకబడినప్పటికీ 10-9తో అద్భుత విజయం సాధించాడు. చివరి దశలో వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ కొటారో కియూకా(Olympic champion Kotaro Kiyooka)పై 3-3తో విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. ఈ విజయంతో 65 కేజీల విభాగంలో ఆసియా క్రీడల స్వర్ణం సాధించిన మూడో భారత రెజ్లర్‌గా సుజీత్ నిలిచాడు.

మరిన్ని వార్తలు