కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్
ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి):కుల వివక్షకు వ్యతిరేకంగా, దళితులు, గిరిజనులు, పేదల హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్(KVPS District Secretary Durgam Dinakar) తెలిపారు. కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, దుస్తులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కుల వివక్ష, పేదరికం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరారు.ట్యాగ్స్ జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్తీక్ విద్యార్థులు సామాజిక సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం పవన్ కుమార్, నాయకులు పస్తం ఆనంద్‌రావు, ఇప్ప ప్రసాద్, శేఖర్, భాస్కర్, ప్రశాంత్, సామిల్, నితిన్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గేదం టీకానంద్, దుర్గం రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.