మండలంలో ప్రత్యేక గ్రామసభలు.
ఎర్రుపాలెం అక్టోబర్ 2 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జయంతి(Gandhi Jayanti)ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని 31 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలకు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
తక్కెల్లపాడు, పెగళ్లపాడు గ్రామ సభలకు ఎం ఎస్ ఎస్ శారదాదేవి, ఎంపీడీవో మరియు బనిగండ్లపాడు గ్రామ సభ కు ఆర్. రామకృష్ణ క్లస్టర్ ఏపీ డి -డి ఆర్ డి ఎ, ఏపీవో కృష్ణ రేమిడిచర్ల గ్రామ సభకు హాజరైనారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో, ఏపీ డి మాట్లాడుతూ, వి బి జిరాంజీ పధకంలో భాగంగా గ్రామంలోని కూలీలకు 30 జూన్ 2027 వరకు నిరంతరంగా ఉపాధి కల్పించేందుకు అవసరమైన పనులను ముందుగానే గుర్తించి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామంలోని సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్ తయారు చేసి, గ్రామానికి అవసరమైన పనులను గుర్తించాలని తెలిపారు.
అదేవిధంగా వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్లాన్ వి బి జి రామ్ జి ప్లాన్ రూపొందించి, అందులో గ్రామీణ ప్రాంతానికి ఉపయోగకరమైన నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు మరియు సహజ వనరుల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ ప్రణాళికలో భాగంగా:
పంట కుంటలు. ఇంకుడు గుంతలు ఫారం పాండ్లు కమ్యూనిటీ సోక్ ఫిట్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్లు, బోరు రీఛార్జ్ ఫిట్లు, చెక్ డ్యాములు,
నీటి సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధికి సంబంధించిన పనులను గ్రామ అవసరాలకు అనుగుణంగా గుర్తించి, గ్రామ సభ ఆమోదంతో ప్రణాళికలో చేర్చాలని తెలిపారు. గ్రామంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, గ్రామ ప్రజలకు ఉపాధి కల్పన మరియు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ పనులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
గ్రామ సభలో అధికారులు విబి జిరాంజి కార్యక్రమం లక్ష్యాలు, గ్రామీణ ఉపాధి అవకాశాలు, నీటి సంరక్షణ పనుల ప్రాధాన్యత మరియు గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీ విధానం గురించి గ్రామ ప్రజలకు వివరించారు.
గ్రామాలలోని సర్పంచులు ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, వివిధ శాఖల సిబ్బంది గ్రామ ప్రజలతో కలిసి గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి, గ్రామ సభ ద్వారా ప్రణాళిక రూపొందించేందుకు సహకరించారు. గ్రామ ప్రజలు గ్రామ సభలలో పాల్గొని గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని వి బి జి రాంజీ ప్రణాళికలో చేర్చేందుకు తమ సూచనలు మరియు అభిప్రాయాలను తెలియజేశారు.