రుద్రంగి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు

24-10-2026 | 03:32pm

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ సర్పంచ్ గండి నారాయణ(Rudrangi Sarpanch Gandi Narayana), ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, వార్డు మెంబర్లు, మీడియా సమావేశం నిర్వహించి గ్రామ ప్రజలకు మహిళాకు యువతకు అధికారులకు పంచాయితీ సిబ్బందికి పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ... గ్రామంలో జరిగిన దసరా, బతుకమ్మ పండుగ వేడుకలను(Bathukamma festival) విజయవంతం చేసిన సందర్బంగా గ్రామ ప్రజలకు ధన్యవాదాలనీ అన్నారు.

తాను సర్పంచ్ గా గెలిచినా తర్వాత తమ పాలకవర్గంతో నిర్వహించిన మొదటి దసరా బతుకమ్మ పండుగలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించడానికి సహకరించిన గ్రామ ప్రజలకు మహిళలకు యువతకు కృతజ్ఞతలు తెలిపారు. గత పదిహేను రోజులుగా పండగ  ఏర్పాట్లకై తమ పాలకవర్గం ఎంతగానో కృషి చేసిందని అన్నారు. గ్రామంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు పండగలకు ప్రజలు మరియు మా పాలకవర్గం ఇలాగే సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు