చిల్పూర్ గుట్టపై వైభవంగా స్వామివారి కల్యాణం
24-10-2026 | 03:28pm
చిల్పూర్,(విజయక్రాంతి): జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట(Chilpur Gutta)పై కొలువైన శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానం(Sri Bugulu Venkateswara Swamy Temple)లో శనివారం స్వామివారి కల్యాణం వేదమంత్రాల నడుమ వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి బి. లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు రవీందర్ శర్మ, శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.