ఇల్లెందులపాడు సెక్టార్‌లో ఘనంగా పోషణ మాసం ముగింపు వేడుకలు

09-10-2026 | 05:49pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): పోషకాహారంపై(Nutritious food) అవగాహన పెంపొందించడంతో పాటు గర్భిణులు(Pregnant women), బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ సేవలను(Anganwadi services) సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర సూచించారు. ఇల్లెందులపాడు సెక్టార్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన పోషణ మాసం ముగింపు ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు, ప్రభుత్వ పథకాలను(Government schemes) అర్హులైన లబ్ధిదారులందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

పోషణ ప్రతిజ్ఞ చేయడంతో పాటు మహిళలు బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ అరుణకుమారి, జిల్లా మిషన్ శక్తి జనరల్ స్పెషలిస్ట్ జుబేదా, సూపర్‌వైజర్ ధనలక్ష్మి, ఇల్లెందులపాడు సెక్టార్ అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, విద్యా కమిటీ చైర్మన్లు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు