కాన్సిరాం వర్ధంతి వేడుకలు
నిర్మల్ అక్టోబర్ 9 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో కాన్సిరాం వర్ధంతి వేడుకలను(Kanshi Ram's death anniversary commemorations) బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న(Yatakari Sayanna) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యంలో వాటా ఉంటేనే హక్కులు సాధ్యమవుతాయని నమ్మి, గొప్ప పోరాటం చేసిన నాయకుడు కాన్షీరాం అని కొనియాడారు. అసెంబ్లీ, పార్లమెంటుల ముఖం చూడని అనేక కులాలను రాజకీయాల వైపు నడిపించిన యోధుడని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, లీగల్ సెల్ అడ్వైజర్లు సుంకరి రాజు చారి, బోడిగం శ్రీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి ముద్రపోయిన వినేష్, జిల్లా కార్యదర్శి కల్లూరు సుధాకర్, మోహన్‌దాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జి బొజ్జ అశోక్, నాయకులు మోర స్వామి, మురళి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.