ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ వేడుక
09-10-2026 | 06:24pm
పాల్గొన్న ఉపాధ్యాయులు
బోథ్. అక్టోబర్ 9 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో(Model School) ముందస్తు బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి విద్యార్థులతో(Students') కలిసి ఉపాధ్యాయులు(Teachers) ఆడి పాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనురాధ(Principal Anuradha) బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఆదర్శ పాఠశాల చైర్మన్ శోభ, వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.