పల్లె సద్దుల కళారూపాలతో హెచ్ఐవీపై అవగాహన

17-09-2026 | 06:22pm

మణుగూరు,(విజయక్రాంతి): జానపద కళారూపాల(folk art forms) ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్‌(HIV, AIDS)పై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. ప్రసాద్(District Program Officer Dr. B. Prasad) పర్యవేక్షణలో మణుగూరులోని టీడీపీ సెంటర్, బస్‌స్టేషన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలూరి రాము జానపద కళాబృందం సభ్యులు పల్లె సద్దులు, నాటికలు తదితర కళారూపాలను ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకున్నారు.

హెచ్ఐవీ ఏ విధంగా సంక్రమిస్తుంది, వైరస్‌ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సుఖవ్యాధులు, ఏఆర్టీ  సేవలు, ఐసీటీసీ కేంద్రాల సేవలు, రక్తదానం తదితర అంశాలపై కళారూపాల ద్వారా అవగాహన కల్పించారు.అదేవిధంగా హెచ్ఐవీకి సంబంధించిన సమాచారం, సేవలు పొందేందుకు 1097 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. హెచ్ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్స పొందడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

కార్యక్రమంలో బ్రేక్‌ఫ్రీ క్యూఆర్ కోడ్పై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఏడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉందా లేదా తెలుసుకోవచ్చని తెలిపారు. రిస్క్ ఉన్నవారు సమీపంలోని ఐసీటీసీ కేంద్రాల్లో ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ నాగజ్యోతి, ప్రాజెక్ట్ మేనేజర్ సాగర్ రెడ్డి, జిఎన్ఎమ్ అనూష, ఓ ఆర్ డబ్ల్యు ఎస్ సుజాత, నాగేంద్ర, ప్రభావతి, జయలక్ష్మి, ఉష, మేరీ, కుమారి, నాగరాజు, లక్ష్మి ప్రసన్నతో పాటు కళాకారులు పోలూరి రాము, కొచ్చర్ల గురవయ్య, ఊటుకూరి రాంబాబు, రమ, పృథ్వీ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు