రాష్ట్రస్థాయి పోస్టర్ మేకింగ్ పోటీల్లో ములకలపల్లి విద్యార్థినికి ప్రథమ బహుమతి.

11-09-2026 | 10:33pm

జిల్లా విద్యాశాఖ అధికారి అభినందనలు

ములకలపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం ఎస్సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోస్టర్ మేకింగ్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)కు చెందిన విద్యార్థిని అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. జిల్లాలోని ములకలపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల(Telangana Social Welfare School)లో 9వ తరగతి చదువుతున్న ఎస్.ధనలక్ష్మి ఈ ఘనత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. రాష్ట్రస్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన విద్యార్థిని ధనలక్ష్మిని,ఆమెను ఈ పోటీలకు సిద్ధం చేసిన పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయ బృందాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారు.రాబోయే రోజుల్లో విద్యార్థులు ఇలాగే అన్ని రంగాల్లో రాణించి జిల్లాకు మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు