అనురాగ్ లో ముగిసిన రిట్రీవల్-ఆగ్మెంటెడ్ జనరేషన్ వర్క్ షాప్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)లోని కృత్రిమ మేధస్సు విభాగం, న్యూరల్ నెక్సస్ క్లబ్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ జనరేషన్(Retrieval-Augmented Generation) అంశాలపై జరిగిన రెండు రోజుల వర్క్‌షాప్ ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరిశ్రమకు సంబంధించిన విలువైన అవగాహనతో పాటు, ఆధునిక ఏఐ సాంకేతికతలపై ప్రాక్టికల్ అనుభవం లభించింది.
మొత్తం 110 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొని, మెరుగుపరచిన సిస్టం లను అమలు చేసి పరీక్షించారు. వర్క్‌షాప్ ముగింపు సందర్భంగా డాక్టర్ జి. దిలీప్ కుమార్ డాక్టర్ జమీర్ గుల్జార్ కు వారి విలువైన మార్గదర్శకత్వం, అవగాహన కలిగించే సెషన్లకు గుర్తింపుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనురాగ్ యూనివర్సిటీ ఆర్ అండ్ డి విభాగానికి చెందిన డాక్టర్ దేవజ్యోతి, ఏఐ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎం. త్రిప్తి, ప్రొఫెసర్ డాక్టర్ కె. బసవరాజు కలిసి రిసౌన్స్ పర్సన్స్ ను సన్మానించారు.