చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలి

23-10-2026 | 09:47pm

సర్ ప్రక్రియను రద్దు చేయాలి.

సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో. 

కొత్తగూడెం: టౌన్. 23 (విజయక్రాంతి): జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) తొలగించేవరకు ఉద్యమం కొనసాగిస్తాం. ఎస్ కే ఎం, ప్రజాసంఘాల ఐక్య వేదిక హెచ్చరిక. దేశంలో ఓట్లను(Votes) తొలగిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్(Chief Election Commissioner Gyaneshwar Kumar) ని తొలగించాలని,  సర్ కార్యక్రమాన్ని రద్దు చేసేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో సంయుక్త కిసాన్ మోర్చా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంబర్లపూడి రాము, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సాగర్, ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బానోతు ఊక్లా ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాటోత్ కృష్ణ ,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ లు పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలలో ఓటుని ప్రజలు ఉపయోగించుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందనీ,  అటువంటి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం డైరెక్షన్లో కేంద్ర ఎన్నికల సంఘం జేబు సంస్థ లాగా పనిచేస్తుందని వారన్నారు.

దేశంలో ఎవరికి ఓటు ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనేది కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్ణయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారన్నారు. ప్రతిపక్ష ఓట్లని కావాలనే తొలగించటం సరైంది కాదన్నారు. అధికార బిజెపికి అనుకూలమైన ఓటింగ్ ను కొనసాగించడం ఇది రాజ్యాంగ విరుద్ధమని  పేర్కొన్నారు . భారతదేశంలో 13 1/2 కోట్ల ఓట్లను తొలగించటం కారణాలు దానికి సమాధానం కేంద్రీయ ఎన్నికల కమిషన్ చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఓట్లను తొలగిస్తూ అక్కడ అధికారాన్ని బిజెపి చేజిక్కించుకుంటూ ఏవీఎంలు ఓట్లను తొలగింపు వంటి అంశాల ద్వారా ముందుకు కదులుతుందని వారి విమర్శించారు.

ఒక స్వతంత్ర సంస్థ లాగా పనిచేసి ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించాల్సిన కేంద్రీ ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరైంది కాదని తెలిపారు. ఇప్పటికీ తొలగించిన ఓట్లని చనిపోయి డూప్లికేషన్ ఉన్నాయి మినహా మిగతా వాటిని యధావిధిగా చేర్చాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియ పేరు తోటి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి దాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు .కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఉన్న ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు సభ్యులు వ్యతిరేకించిన ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదన్నారు.

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జ్ఞానేశ్వర్ కుమారుని వెంటనే తొలగించాలని ఎన్నికల కమిషన్ ని ఎన్నుకునే పాత పద్ధతిని కొనసాగించి కొత్త ఎన్నికల కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ని తొలగించి సర్ ప్రోగ్రామ్ ని నిలిపివేసేదాకా మా ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాంకుడోత్కోబల్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వాంకుడోత్ అమర్ సింగ్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధరావత్ శివ లకావత్ కుమార్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాతంగి రాజేష్, మహిళా సంఘం పట్టణ అధ్యక్షులు అన్నవరపు ఇందిరా సందకూరు లక్ష్మి ఏ ఐ యు కె ఎస్ నాయకులు బుర్ర వెంకన్న గోపాల్రావు ఆజాద్ ఏ కే ఎం ఎస్ నాయకులు ఉమర్ కల్తి వెంకటేశ్వర్లు రామచందర్ ప్రజా సంఘాల నాయకులు సుధీర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు